Home వనపర్తి నూతన గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం…

నూతన గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం…

singi-reddy-image

 కళ్యాణలక్ష్మీతో రాష్ట్రంలోని ఆడపడుచుల
పాలిట సిఎం కెసిఆర్ మేనమామగా నిలిచారు

60 రోజుల్లో పెద్దమందడి మండలాన్ని
కృష్ణమ్మ నీటితో పులకింపజేస్తాం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కెసిఆర్‌కు
అండగా నిలిచి విశ్వాసాన్ని చాటిచెబుదాం

దేశానికే ఆదర్శం రైతుబంధు పథకం:
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిమన 

తెలంగాణ/పెద్దమందడి : గ్రామా ల సమగ్రాభివృద్ధి పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటైన నూతన గ్రామ పంచా యతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా మని  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పెద్దమందడి మండ లంలో నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన చిలకటోనిపల్లి, అమ్మపల్లి ,గట్ల ఖానాపురం తండా, చీకురు చెట్టు తండా, ముందరి తండా, బలిజపల్లి, అనకాయప ల్లి తం డా, బుగ్గపల్లి తండాల్లో పర్యటించి టిఆర్‌ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించా రు. ఈసం దర్భంగా ఆయా గ్రామాల్లో  నిరంజన్‌రెడ్డికి ప్రజలు ఘనంగా స్వాగ తం పలికారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలోనిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా కల్గిన ప్రతి ఆవాస ప్రాంతాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చే సిన సిఎం  కెసిఆర్‌కు నూతన గ్రామ పంచాయతీల ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. స్వంత పరిపాలన ఉండడం వల్ల గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతాయన్న లక్షంతోనే తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగింద న్నారు. రాష్ట్రంలో పేదింటి తల్లిదండ్రులకు ఆడపడుచులు భారం కావద్దన్న గొప్ప సంకల్పం తో కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టి రూ. లక్షా116లను ఆడపడుచుల పెళ్లిళ్లకు కానుకగా ఇస్తూ సిఎం కెసిఆర్ మేనమామ పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. గ్రామాల్లో విద్య, వైద్యం, కెసిఆర్ కిట్టు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి పథకాలను ప్రతి ఇంటికి వర్తింప జేస్తు న్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని దేశంలో ని  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఆయా రాష్ట్రా ల్లో అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. 60రోజుల్లోపే పెద్దమందడి మండలంలోని అన్ని గ్రామాల్లో గల ప్రతి ఎకరాకు కృష్ణమ్మ నీటిని పారిస్తామని రైతుల పొలాల్లో ఇక నుండి సిరు ల పంటలు పండిస్తామన్నారు. 21 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దమందడి బ్రాం చ్ కెనాల్  పనులు మూడు షిఫ్ట్‌లుగా యుద్దప్రాతిపాదికన చేపట్టి కేవలం 45 రోజుల్లోనే నా ల్గు న్నర కిలో మీటర్ల కాల్వను తవ్వి పామిరెడ్డిపల్లి వరకు సాగునీరు ఇవ్వడం జరిగిందని ,మరో రెండు రోజుల్లో పామిరెడ్డిపల్లి మీదుగా దొడగుంటపల్లి,పెద్దమందడి చెరువులను నిం పి అక్కడి నుండి మద్దిగట్ల, అమ్మపల్లి, వెల్టూర్  గోపాల సముద్రం చెరువు వరకు కృష్ణమ్మ నీటిని పారిస్తామన్నారు. అమ్మపల్లి  గ్రామంలో 33/11  కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు మద్దిగట్ల క్రాసింగ్ నుండి అమ్మపల్లి మీదుగా గట్లఖానాపురం వరకు బిటి రోడ్డును నిర్మిస్తామన్నారు. తక్షణమే గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరిం చడంతో పాటు గ్రామానికి మొదటి విడతగా 30 డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేస్తా మన్నారు. శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కొనుగోలు చేసి గ్రామస్తులకు అప్పగిస్తామన్నారు. అనంతరం నిరంజన్‌రెడ్డి అమ్మపల్లిలో సబ్సిడి ట్రాక్టర్‌ను రైతుకు పంపిణి చేశారు. నూత నంగా గ్రామ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాల్లో సిఎం కెసిఆర్ చిత్రపటాలకు గ్రామస్తు లు ,మహిళలు ,టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, మండల ఎంపిపి దయాకర్, మండ ల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజప్రకాష్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు విట్టా శ్రీని వాస్‌రెడ్డి, ఎంపిటిసి చాపల సత్యారెడ్డి, మండల టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి వేణుయాద వ్,నాయకులు రఘుపతి రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి నాగేంద్రం యాదవ్, రఘువర్ధన్‌రెడ్డి, గత్పా వెంకటేశ్వర్‌రెడ్డి,చిత్తూర్ కృష్ణారెడ్డి, సతీష్‌శర్మ, ఖాజాహుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.