Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి..

Two Men Died in Car Accident at Kadthal

విశాఖపట్నం: జిల్లాలోని ఎస్‌. రాయవరం మండలం గోకులపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నవ వరుడు మృత్యువాత పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే.. అనకాపల్లి శారదానగర్‌కు చెందిన శంకర్‌ అనే వ్యక్తికి మూడు రోజుల క్రితం వివాహం జరిగింది. దంపతులు ఇద్దరు సియాజ్‌ కారులో అనకాపల్లి నుంచి పాసర్ల వైపు బయలుదేరారు. వేగంగా ప్రయాణిస్తున్న దంపతుల కారు గోకులపాడు సమీపంలో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వరుడు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments