Search
Monday 24 September 2018
  • :
  • :

చిరుకు జోడీగా కొత్త హీరోయిన్?

Chiru

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే ఆయన కొరటాల శివ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా  ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దడంతో పాటు క్యాస్టింగ్, టెక్నీషియన్స్ ఎంపికపై దృష్టిసారించాడట కొరటాల. ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది హీరోయిన్ ఎంపిక. చిరు వయసుకు సరిపోయే హీరోయిన్‌ను ఎంపిక చేయడం కష్టమే. చిరంజీవి కూడా ఖైదీ నంబర్ 150, సైరా సినిమాలకు హీరోయిన్లను ఎంపిక చేసే సమయంలో ఆ ఇబ్బందిని గమనించాడు కాబట్టే ఓ సీనియర్ హీరోయిన్‌ను తీసుకుందామని కొరటాలకు సూచించాడట. చిరుతో జతకట్టేందుకు అనుష్క, త్రిషలాంటి హీరోయిన్‌లు సిద్ధంగా ఉన్నారట. కానీ కొరటాల మాత్రం కొత్త హీరోయిన్‌ను తీసుకుందామని అంటున్నాడట. 30 ఏళ్లపైన వయసుండే ముంబయ్ మోడల్స్‌ను లేదంటే ఓ పాపులర్ హిందీ టివి సీరియల్  నటిని కానీ తీసుకుంటే బాగుంటుందని…. సినిమాకు ఫ్రెష్ లుక్ వస్తుందని అంటున్నాడట. మరి కొరటాల చిరు సూచనను అనుసరిస్తాడో లేదంటే ఆయనకు నచ్చచెప్పి తన మాటే నెగ్గించుకుంటాడో వేచి చూడాలి.

Comments

comments