Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం

Judges-Sworn

హైదరాబాద్: హైకోర్టుకు కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు ఆరుగురు గురువారం ప్రమాణ స్వీకా రం చేశారు. డివిఎస్‌ఎస్ సోమయాజులు, కొంగర విజయ లక్ష్మి, పోట్లపల్లి కేశవరావు, ఎం. గంగారావు, అభినంద్ కు మార్ షావిలి, టి.అమర్‌నాథ్ గౌడ్‌లతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ మొదటి కోర్టు హాల్లో ప్రమా ణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదు లు, కొత్త జడ్జీల కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌లో గంగారావు, రామసుబ్రమణియన్ సారథ్యంలోని బెంచ్‌లో అభినంద్ కుమార్ షావిలి,  జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి నేతృత్వంలోని బెంచ్‌లో విజయలక్ష్మి, సంజయ్‌కుమార్‌తో కలిసి అమరనాథ్ గౌడ్, సురేశ్‌కుమార్ కెయిత్ బెంచ్‌లో సోమయాజులు, రాజా ఇలంగో సారథ్యంలోని బెంచ్ లో కేశవరావు ఆశీనులై కేసుల్ని విచారించారు. ఇదిలా ఉండగా జస్టిస్ ఇలంగో శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు.

Comments

comments