Home అంతర్జాతీయ వార్తలు దోమల సంతతిని నియంత్రించే కొత్త ఔషధం

దోమల సంతతిని నియంత్రించే కొత్త ఔషధం

mosquitoesలండన్: దోమల పుట్టుకను నియంత్రించే ఔషధాన్ని అభివృద్ధి చేయడంలో అమెరికా శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకు వేశారు. దీనివల్ల కొన్నివేల మందిని బలిగొంటున్న మలేరియా వ్యాప్తిని, దోమల వల్ల సంక్రమించే ఇతర వ్యాధులను నివారించడానికి వీలు కలిగింది. మరో ఐదేళ్లలో ఈ డ్రగ్ అందుబాటు లోకి వస్తుంది. ఆరిజోనా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఆడదోమలకు సంబంధించిన అసమాన ప్రోటీన్ ను కనుగొన్నారు. అదే దోమ గుడ్లు పొదగడానికి దోహదం చేస్తుంది. ఆ ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు అడ్డగించేసరికి ఆడదోమలు కవచాలు లేని గుడ్లను కన్నాయి. ఫలితంగా గుడ్ల లోని పిండాలు చనిపోయాయి. ప్రొటీన్‌ను గురి పెట్టి డ్రగ్స్‌ను అభివృద్ధి చేస్తే తేనెటీగల వంటి ప్రయోజనకరమైన కీటకాలకు ఎలాంటి హాని జరగకుండా దోమల సంతతిని నివారించ వచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇది ముఖ్యమైన పరిశోధనగా రోజర్ మియస్‌ఫీల్డు అభివర్ణించారు. యూనివర్శిటీ కెమిస్ట్రీ, బయోకెమిస్రీ ్టవిభాగం అధిపతిగా రోజర్ పనిచేస్తున్నారు. దోమల నిర్మూలనలో ఇది సరైన ప్రక్రియగా పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) వివరణ ప్రకారం ప్రపంచంలో హానికరమైన ప్రాణుల్లో దోమలు ఒకటి. వీటివల్ల పురోగతి దెబ్బతింటోంది. మలేరియా నిరోధ చర్యలు ప్రపంచ వ్యాప్తంగా స్థంభించాయి. 2016లో దోమల వల్ల 216 మిలియన్ ప్రజలు బాధితులయ్యారు. వారిలో 4,45,000 మంది మృతి చెందారు. సబ్ సహరాన్ ఆఫ్రికాలో పిల్లలు, శిశువులు ఎక్కువగా దోమల బాధితులవుతున్నారు.

దోమల నియంత్రణకు ప్రస్తుతం వినియోగిస్తున్న పద్ధతులను సుదీర్ఘకాలంగా వినియోగించడంతో దోమలు వాటిని ప్రతిఘటించే స్థాయికి చేరుకున్నాయి. పరిశోధకులు ఇప్పుడు ఈ ప్రొటీన్‌ను అరికట్టడం వల్ల దోమలు తమ మిగతా రెండు మూడు వారాల జీవన కాలంలో గుడ్లను పెట్టే అవకాశం లేకుండా పోయింది. ఒకసారి ఆ ప్రొటీన్‌ను ఆపడంతో ఆడదోమ గుడ్లు పెట్టడానికి అవకాశం లేకుండా పోయిందని అందువల్ల పుట్టుకను నియంత్రించడమే గొప్ప మార్గంగా పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ పరిశోధన వల్ల మరికొన్ని కొత్త తరం క్రిమిసంహారక మందులను ఐదేళ్లలో కనుగొనడానికి దోహదపడుతోందని చెప్పారు.

new medicine to control mosquitoes
సైన్స్ విభాగం