Search
Thursday 15 November 2018
  • :
  • :

ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు వీళ్లే..

          Nine-Ministers

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం ఉదయం  కొత్త మంత్రులతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. శివ ప్రతాప్ శుక్లా, అశ్వినికుమార్ చౌబే , వీరేంద్ర కుమార్ , అనంతకుమార్ హెగ్డే , గజేంద్రసింగ్ షెఖావత్ , ఆల్ఫాన్స్ కన్నంతనం , రాజ్ కుమార్ సింగ్ , హర్దీప్ సింగ్ పూరి, సత్యపాల్ సింగ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తన  కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవ‌స్థీక‌రించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, రాజ్య సభ, లోక్ సభ ఎంపిలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో నలుగురు బ్యూరోక్రాట్లు ఉండగా ఐదుగురు లోక్‌సభకు ఎన్నికైన వారు ఉన్నారు.

Comments

comments