Home టెక్ ట్రెండ్స్ మళ్లీ మార్కెట్లోకి నోకియా బుల్లి ఫోన్…

మళ్లీ మార్కెట్లోకి నోకియా బుల్లి ఫోన్…

Nokia 106 Phone

ముంబయి: హెచ్‌ఎండి గ్లోబల్‌ బ్రాండ్ అయిన నోకియా తనపాపులర్‌ మోడల్‌ మొబైల్ ఫోన్ ను మళ్లీ లాంచ్‌ చేయనుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో క్రమంగా తనస్థానాన్ని పదిల పర్చుకుంటుంది నోకియా. అయితే ఈ ఫోన్ ను అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌ను మళ్ళీ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. తాజాగా నోకియా 106(2018)ను రష్యా మార్కెట్ లో రిలీజ్ చేసింది. 2013లో రిలీజ్ అయిన మంచి ఆదరణ పొందిన ఈ ఫోన్‌కు మరిన్ని ఫీచర్లను చేర్చి తాజాగా రిలీజ్ చేసింది.  తాజానోకియా ఫీచర్‌ ఫోన్‌ లాంగ్‌ బ్యాటరీ లైఫ్‌ ఇస్తుందని సంస్థ పేర్కొంది. 15గంటల టాక్‌ టైం 21 స్టాండ్‌ బై  తమ ఫీచర్‌ ఫోన్‌ సొంతమని సంబంధిత అధికారులు తెలిపారు.

నోకియా 106(2018) అద్భుత ఫీచర్లు 
1.8ఇంచెస్‌డిస్‌ప్లే
మీడియా టెక్‌ ఎంటి 6261 డీ ప్రాసెసర్‌
4 ఎంబి ర్యామ్‌, 4 ఎంబి స్టోరేజ్‌
ఎఫ్‌ఎం రేడియో, ఎల్‌ఇడి  ఫ్లాష్‌ లైట్‌
800ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Nokia 106 Phone

నోకియా 106(2018) ఫోన్  1750 రూపాయలకు  కస్టమర్లు లభించే అవకాశం ఉంది. 2013లో ఈ ఫోన్ 1399రూపాయలకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కాగా, ఇండియాతో పాటు ప్రపంచ దేశాల మార్కెట్‌లోకి ఈ ఫీచర్‌ ఫోన్‌ ఏప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే అంశం పై సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

New Nokia 106 Feature Phone

telangana latest news