Home ఖమ్మం పంచాయతీలకు కొత్త కళ..!

పంచాయతీలకు కొత్త కళ..!

New Panchayat laws in telanagana

రెండు నెలలకోసారి గ్రామ సభ లు నిర్వహించాల్సిందే.
పని చేయని అధికారుల పై చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టం
సర్పంచ్‌ల ను తొలిగించేందుకు కలెక్టర్ కు అధికారులు
అక్రమ లే అవుట్ల కు అనుమతి ఇస్తే పాలకవర్గం రద్ధు.
మనతెలంగాణ-నేలకొండపల్లి
గ్రామాలు అన్ని రంగాలల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పంచాయత్‌రాజ్ చట్టం ను తీసుకొచ్చింది.ప్రజా ప్రతినిధులు తో పాటు అధికారుల కు పూర్తి బాధ్యతలు అప్పగించి పల్లె లు అభివృద్ధి కి పాటు పడే విధంగా చట్టం ను రూపొందించింది.ముఖ్యంగా పల్లెలో కనీస మౌళిక సదుపాయాలు కల్పించేందుకు పెద్ధపీట వేసింది.నిధులు దుర్వినియోగం చేసే అధికారులు సర్పంచ్‌ల పై కఠిన చర్యలు తీసుకోనుంది.ప్రజా ప్రతినిధులు జవాబుదారి తనాన్నిపెంచుతూ గ్రామ రూపురేఖలు మార్చాలని లక్షంగా ప్రభుత్వం నిర్ధేశించింది.నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి కేంద్ర ప్రుభుత్వం తరహా లో పంచాయతీలకు నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంది.రాష్ట్ర బడ్జెట్ లోనే పంచాయతీ లకు ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా చర్యలు చేపట్టింది.దీంతో ఒక్క గ్రామ పంచాయతీ కి వాటి జనాభా ను బట్టి రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు వరకు నిధులు అందనున్నాయి.జిల్లాలో ప్రస్తుతం 417 పంచాయతీ లు ఉండగా, కొత్తగా 169 పంచాయతీలు ఏర్పాటు చేసింది.
ఉపసర్పంచ్ కు ప్రాధాన్యత….
గతంలో ఉప సర్పంచ్ కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయింది.కానీ ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త పంచాయత్ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ తో పాటు, ఉప సర్పంచ్ కు సంయుక్తంగా చెక్ పవర్ ను ఇవ్వనున్నారు.గతంలో ఈ అధికారాలు పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి కి ఇచ్చారు.దీంతో ఉప సర్పంచ్ కు కూడ ప్రాధాన్యత పెరిగింది.ప్రస్తుతం గ్రామాలలో రిజర్వేషన్ లు సరిపడని బడా నాయకులు ఈ పదవి అయినా దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.అలాగే ప్రతి మూడు నెలకొకసారి నిర్వహిస్తుండుగా ప్రస్తుతం అది రెండు నెలలకొసారి కచ్చితంగా నిర్వహించాల్సి ఉంది. అలా నిర్వహించని పాలకవర్గం ను రద్ధు చేసే అధికారం ను కల్పించారు.నిబంధనలు, పధకాలను సరిగా అమలు చేయన పాలక వర్గాలను కూడ రద్ధు చేసే అధికారం కలెక్టర్ల కు కల్పించారు.
కార్యదర్శి ల పై కొరడా….
తెలంగాణ కు హరితహారం కింద నాటిన మొక్కలు 85 శాతం బతకకుంటే పంచాయతీ కార్యదర్శి లను సస్పెండ్ చేసే అధికారాన్ని కొత్త చట్టం లో కల్పించారు.వీటితో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి లు కచ్చితంగా సంబంధిత గ్రామాల్లో నే నివాసం ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.మరో వైపు నర్సీరీ లు పెంచని గ్రామ సర్పంచ్‌లను తొలిగించే అవకాశం ఉంది.గ్రామంలో ఉన్న ఓటర్ల సంఖ్య ను బట్టి కనీసం పది శాతం మంది ప్రజలు గ్రామ సభ కు హజరు కావాలి.ప్రతి గ్రామ సభ ను వీడియో తీయటం తో పాటు తీసుకునే నిర్ణయాలను ఆయా గ్రామపంచాయతీ వెబ్‌సెట్లో పొందుపర్చాలి.నిర్ణీత గడువు లోగా పంచాయతీ అకౌంట్ల ను ఆడిట్ చేయకపోతే సర్పంచ్, కార్యదర్శి లు తమ పదవులు కొల్పోక తప్పదు.
అక్రమ లే అవుట్ల కు అనుమతిఊ్త అంతే…..
గ్రామ పంచాయతీ ల పరిధిలో ఇళ్ల స్థలాలు, లే అవుట్ల పర్మిషన్ల ఇచ్చిన పాలక వర్గాలను ఈ కొత్త చట్టం ప్రకారం రద్ధు చేయవచ్చు.వ్యవసాయ భూమి ని ఇళ్ల స్థలాలు గా మార్చుకోదలిచిన స్థిరాస్థి వ్యాపారాలు తొలుత వ్యవసాయం చట్టం కింద రుసుము చెల్లించాలి.ఇలా భూ మార్పిడి చేసిన తరువాత నే పంచాయతీ కి అప్పగించాలి.ఇలా చేసిన ఏడు రోజులలో పాలకవర్గం వీటి ని పరిశీలించి టెక్నికల్ మంజూరు విభాగానికి పంపించాలి.భవన నిర్మాణాలకు కూడ గ్రామాలల్లో 15 రోజులలో అనుమతించాల్సి ఉంటుంది.దీనికి కార్యదర్శి సబార్డినేటర్ గా ఉండటంతో అతడి పై భాద్యత మరింత విస్త్రతమైంది.
కొత్త చట్టం ను పకడ్బంధీగా అమలు చేయాలి.పావులూరి వెంకటేశ్వరరావు, నేలకొండపల్లి
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం పకడ్బందీగా అమలు చేయాలి.కొత్త పంచాయతీలకు నిధులు కేటాయించాలి.ప్రభుత్వం లక్షం నెరవేర్చాలంటే చట్టం ను కచ్చితంగా అమలు చేయాలి.తప్పు చేస్తే ఎంతటి వారినైనా తొలిగించే విధానం ఉండాలి.చట్టం పై అవగాహాన కల్పించాలి.
పల్లెలు బలోపేతం కోసమే కొత్త పంచాయతీలు..కోటి సైదారెడ్డి, కోనాయిగూడెం మాజీ సర్పంచ్.
తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీలు ఏర్పాటు సాహసోపేత నిర్ణయం.కొత్త పంచాయతీల వలన పల్లెలు అభివృద్ధి చెందుతాయి.ప్రజలకు అందుబాటులో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉంటారు.పాలన సౌలభ్యంగా ఉంటుంది.ప్రభుత్వం నిర్ణయం చాలా మంచిది.
చట్టం పై ప్రజలకు అవగాహాన కల్పించాలి.బచ్చలకూరి నాగరాజు, కొరట్లగూడెం,
తెలంగాణ ప్రభుత్వం పంచాయత్‌రాజ్ చట్టం లో తీసుకొచ్చిన మార్పులు మంచిదే.కానీ చట్టం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి.అందుకే పంచాయతీ స్థాయిలో ప్రజలకు చట్టం గురుంచి అవగాహన కల్పించాలి.అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్షం నెరవేరుతుంది.