Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఆగస్టు 2 నుంచి కొత్త పంచాయతీలు

కొత్త చట్టం ప్రకారం అవతరించనున్న 4,383 నూతన గ్రామపంచాయతీలు

ముగియనున్న పాత పంచాయతీల పదవీకాలం
స్పెషల్ ఆఫీసర్ల పాలన అంశంపైనా ప్రభుత్వం యోచన
ఎటువంటి ఏర్పాటైనా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడడమే లక్షం
కలెక్టర్లతో విడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు

Video-con

హైదరాబాద్ : ప్రస్తుతం ఉనికిలో ఉన్న పంచాయతీల పదవీకాలం ఈ నెలాఖరుకు ముగుస్తున్నందున పాలకవర్గాలు రద్దు కానున్నాయని, అయితే ఈ ప్రభావం గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాలపై పడకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆగస్టు 2వ తేదీ నుంచి రాష్ట్రంలో 4,383 కొత్త గ్రామ పంచాయతీలు ఉనికిలోకి వస్తున్నాయని, వాటికి ఎన్నికలు జరగనందున పాలకవర్గాలు లేవని, అయితే జాప్యానికి తావులేకుండా అక్కడ కూడా అభివృద్ధి పనులు జరిగేలా ప్రణాళికను రూపొందించాలనిమంత్రి స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగించడంలో ఉన్న లీగల్ చిక్కులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని, ప్రత్యేక అధికారుల ద్వారా పాలన సాగించడంపై కూడా ఆలోచనలు చేస్తూ ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలకు ఇబ్బంది కలకుండా చూడడమే ప్రధానమని స్పష్టం చేశారు. వారం రోజు ల్లో రాష్ట్రవ్యాప్తంగా నాల్గవ విడత హరితహారం ప్రారంభం కానుండడం, ఉపాధిహామీ పనులు, పలు అభివృద్ధి పనులు ఉన్నందున పంచాయతీల్లో పాలకవర్గాలు లేవనే పేరుతో ఆటంకం కలగరాదని స్పష్టం చేశారు. ఆయా పంచాయతీల్లో మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. నూతన పంచాయతీలకు భవనాల ఏర్పాటు, ఉద్యోగుల విభజన, ఆస్తుల విభజన తదితర అంశాలను నాలుగైదు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన విభజించి కొత్త పంచాతీయలకు అప్పగించాల్సిన అవసరముందన్నారు. అవసరమైన చోట్ల క్లస్టర్ల విభజనచేసి జనాభా ప్రాతిపదికన గ్రామ, పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని సూచించారు. ఈ లెక్కన నాలుగైదు గ్రామాలు, ఐదారువేల మంది జనాభాకు ఒక కార్యదర్శి ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తిచేశారు. ఈ ఏడాది హరితహారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభు త్వం భావిస్తున్నందున, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయడం, మొక్కలను పెంచడం తదితర పనులపై ప్రధాన దృష్టి కేంద్రీకరించాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగం గా సీజనల్ పనులన్నింటినీ ఇప్పటికే పూర్తిచేశామని పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ మంత్రికి వివరించారు. ఇందుకోసం వీలైనన్ని ఎక్కువ రోజులు పని కల్పించినట్లు మంత్రికి తెలిపారు. ఇందుకు దాదాపు రూ.9 కోట్ల విలువచేసే పని దినాలను వినియోగించినట్లు చెప్పారు. రానున్న రెండు,

Comments

comments