Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అదరగొడుతున్న అల్లు అర్జున్

aa

అల్లుఅర్జున్, అను ఇమాన్యుయల్ జంటగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా పోస్టర్ ఇంపాక్ట్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “అల్లుఅర్జున్, అను ఇమాన్యుయల్ జంటగా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని  గ్రాండియర్‌గా నిర్మిస్తున్నాం. గురువారం నుంచి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. రామోజీ ఫిల్మ్‌సిటీతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సన్నివేశాలను షూట్ చేస్తున్నాము. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు సినిమా ముఖ్య తారాగణం పాల్గొంటోంది. ఈనెల 14వ తేదీ వరకు ఈ ముఖ్యమైన షెడ్యూల్ జరుగుతుంది.  హోలీ పండుగ సందర్భంగా పోస్టర్ ఇంపాక్ట్‌ను రిలీజ్ చేశాం. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసి ఈ చిత్రాన్ని మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః రాజీవ్ రవి, ఎడిటర్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్‌ః రామ్-లక్ష్మణ్.

Comments

comments