Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

స్టాక్ మార్కెట్ల సరికొత్త రికార్డులు

32687.32 పాయింట్లకు సెన్సెక్స్,
10242.45 పాయింట్లకు నిఫ్టీ

Stock-Market

ముంబయి : బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి, ఆటో, చమురు, గ్యాస్ స్టాకులు తిరిగి లాభాల బాట పట్టడం, త్రైమాసిక ఫలితాలతోపాటు సానుకూల పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల ధరల సూచీ(సిపిఐ) ద్రవ్యోల్బణ గణాంకా ల నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 32687.32 పాయింట్లు, నిఫ్టీ 10242.45 పాయింట్ల కొత్త జీవనకాల గరిష్ఠానికి(లైఫ్‌టైమ్ హై) చేరుకున్నాయి. దేశీయ సంస్థాగత మదుపరులు(డిఐఐలు) నిరంతరాయ కొనుగోళ్లతో ట్రేడింగ్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశారని ట్రేడర్లు చె ప్పారు. లోహ, ఆటో, ఎఫ్‌ఎంసిజి, బ్యాంకింగ్, చమురు, గ్యాస్ స్టాకుల్లో విసృత స్థాయి ర్యాలీ కొనసాగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం తన సెప్టెంబర్ త్రైమాసిక ఫ లితాల్లో నగదు లాభం 12.5 శాతం పెరుగుదలను ప్రకటించడంతో దాని స్టాక్ 0.43 శాతం పెరిగి రూ. 880. 50 వద్ద ట్రేడయింది. 30 స్టాకులుండే సెన్సెక్స్ సూచీ 254.63 పాయింట్లు లేక 0.78 శాతం పెరిగి కొత్త గ రిష్ఠం 32687.32కు చేరింది.
సెన్సెక్స్ గతంలో ఆగస్టు 2న తాకిన ఇంట్రాడే రికార్డు 32686.48ను అధిగమించింది. ఇక నిఫ్టీ సైతం 75 పాయింట్లు లేక 0.73 శాతం పెరిగి జీవనకాల గరిష్ఠం 10242.45 పాయింట్లను తాకింది. దేశీయ స్టాక్ మార్కెట్లో బాగా లాభపడిన ఈక్విటీలు సిప్లా, టాటా మోటార్స్, భారతి ఎయిర్‌టెల్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎం అండ్ ఎం, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, ఐటిసి లి., ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టి అని చెప్పాలి. ఆసియా మార్కె ట్లో హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 0.94 శాతం, షాంఘై కంపోజిట్ 0.14 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.63 శాతం పెరిగాయి.

Comments

comments