Search
Saturday 22 September 2018
  • :
  • :

ఇక మీరు ఎక్కడికెళ్లినా… హచ్ కుక్కలా మీ వెంటే మీ లగేజ్..!!

RoboLuggage

చాలా మందికి ప్రయాణాలు చేసేప్పుడు వెంట భారీ లగేజి తీసుకెళ్లాలంటే విపరీతమైన చికాకేస్తుంది. లగేజ్ ని మోసుకెళ్లడం చాలా కష్టం తో కూడు కున్న పని. ఒకరిద్దరు తోడుగా ఉంటే పర్లేదు కాని, ఒంటరిగా భారీ లగేజ్ తో దూర ప్రయాణాలు చేసే వాళ్లు మాత్రం పట్టపగలు చుక్కలు చూడాల్సిందే.

అటువంటి వాళ్ల కోసమే యూఎస్ లో ట్రావెల్ మేట్ అనే రోబో సూట్ కేస్ ను డెవలప్ చేశారు. ఇది మీరు ఎక్కడికెళ్తున్నా హచ్ కుక్కలాగా మిమ్మల్నే ఫాలో అవుతుందట.

“జనరేషన్లు మారుతూ వస్తున్నాయి కాని, ఇప్పటి వరకు సూట్ కేసులు మాత్రం మారలేదు. అందుకే వినూత్నంగా ఆలోచించి, ప్రయాణికుల కంఫర్ట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ రోబో సూట్ కేసును డెవలప్ చేశా”మని ఈ రోబో సూట్ కేసు ను డెవలప్ చేసిన డేవిడ్ నియర్ అంటున్నాడు.

ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ తో పనిచేసే ఈ సూట్ కేస్ మధ్యలో ఏదైనా అడ్డం వస్తే వెంటనే తన రూట్ ను మార్చేసుకుంటుందట. అంతేకాదు, తన ఓనర్ 15 ఫీట్ల కంటే ఎక్కువ దూరం వెళ్తే వెంటనే ఓనర్ స్మార్ట్ ఫోన్ కు మెసేజ్ పంపిస్తుందట ఈ రోబో సూట్ కేసు.

దీన్ని ఇప్పటికే షాపింగ్ మాల్స్ లాంటి ప్రదేశాల్లో సక్సెస్ ఫుల్ గా పరీక్షించారట. అయితే, ఎయిర్ పోర్టుల్లో బ్యాగ్ ను చెక్ చేయడానికి తీసుకెళ్లినప్పుడు ఓనర్ కు దాని గురించి సమాచారం ఎప్పటి కప్పుడు అలారం ద్వారా ఇవ్వడం లాంటి ఫీచర్స్ ను యాడ్ చేయడానికి కృషి చేస్తోందట కంపెనీ.

హమ్మయ్య.. ఇటువంటి సూట్ కేసులు ఇండియాకు కూడా వస్తే ప్రయాణాల్లో లగేజ్ ల మీద లగేజ్ లు మోసుకెళ్లొచ్చు… ఏమంటారు?

Comments

comments