Home తాజా వార్తలు పంచాయతీల్లో కొత్త పాలన

పంచాయతీల్లో కొత్త పాలన

panchayat

నేటి నుంచి స్పెషలాఫీసర్ల వ్యవస్థ
కొత్తగా ఏర్పాటైన పంచాయతీలు నేడే ప్రారంభం

మన తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్
నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో గురువారం నుంచి పాలన ప్రారంభం కానుంది. దేశాభివృద్ది జరగాలంటే గ్రామాలు ఆర్థికంగా అభివృద్ది చెందాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దింది. వీటితో పాటు సర్పంచుల పదవీ కాలం కూడా ముగియడంతో వారి స్థానంలో ప్రత్యేకాధికారులను నియమించి పంచాయతీలో పాలన సాగించనున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామాలకు సంబంధించి పంచాయతీ భవనాలను, ఆస్తుల పంపకాలు, ఇతర మౌలిక వసతులను అధికారులు సిద్దం చేశారు. వివిధ గ్రామాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండానే ఆ గ్రామాల్లో వారికి ఇబ్బందులు లేకుండా అధికారులు అందుబాటులోకి రానున్నారు. తండా వాసుల చిరకాలవాంఛను ప్రభుత్వం నెరవేరుస్తూ 500 జనాభా కలిగిన తండాలను, శివారు పల్లెలను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంతో తండా వాసులు హార్షీతీరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సర్పంచుల స్థానంలో వీరు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలన సాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్తపంచాయతీ భవనాల్లో పౌరసేవా పత్రాలు, పంచాయతీ భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు తెలిసేలా తెలుగులో సూచికలు ఏర్పాటుచేయాలని, పంచాయతీ కార్యదర్శి ఆధీనంలోనే దస్త్రాలు ఉండాలని, కొత్త, ఇప్పటికే ఉన్నపంచాయతీల మధ్య ఆస్తులు, సిబ్బంది, స్టేషనరీ పంపకాలు జనాభా ప్రాతిపదికన జరగాలని, నూతన పంచాయతీకి సంబంధించిన ముద్రలు, స్టాంపులు, కొత్త పంచాయతీ ఆవిర్భావం నుంచే అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీల్లో ఉండాల్సిన సేవలన్నీ కొత్త గ్రామ పంచాయ తీల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని, నూతన పంచాయతీ ఏర్పాటు సందర్భంగా ఆ గ్రామ ప్రజలకు అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టాంటాం చేయించాలని ప్రభుత్వం మార్గదర్వకాల్లో సూచించింది. జిల్లా రఘునాథపాలెం మండలంలోని 17 పంచాయతీల్లోని పలు తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. మొత్తం 20 తండాలను పంచాయతీలుగా మార్చారు. మండలం మొత్తం 37 పంచాయతీలలో గురువారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగనుంది. నూతనంగా ఏర్పడిన పంచాయతీలను ఖమ్మం ఎంఎల్‌ఎ పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 1713 పంచాయతీలుః నల్లగొండ ఉమ్మడి జిల్లాలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 1713 గ్రామపంచాయతీలు ఉండగా 15,146 వార్డులు ఉన్నాయి. కొత్తగా నల్లగొండ, సూర్యాపేట, యాదాధ్రి భువనగిరి జిల్లాల్లో 578 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. కాగా నల్లగొండ జిల్లాలో పాతవి 502, కొత్తవి 342 కలిపి 844కాగా 37 గ్రామపంచాతీలు కొత్త మున్సిపాలిటీల పరిధిలోని వెళ్ళాయి, దీంతో 7340వార్డులు ఏర్పాడ్డాయి. ఇక సూర్యాపేట జిల్లాలో పాతవి 323, కొత్తవి 152 కలిపి మొత్తం 475 పంచాయతీలకు 4322 వార్డులు, యాదాధ్రి భువనగిరి జిల్లాలో 334 పాతవికాగా 84కొత్తవి మొత్తం 401పంచాయతీలు కాగా 17పంచాయతీలు కొత్త మున్సిపాలిటీల పరిధిలో విలీనం కావడం, 3484 వార్డులు కొత్తవి,పాతవి కలిపి ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 265 గ్రామ పంచాయితీలు కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో పాత కొత్త పంచాయితీలు కలసి మొత్తం 721పంచాయితీలు ఏర్పాటు అయ్యాయి. ఈ గ్రామాలన్నింటిలో పంచాయితీల పాలన ప్రారంభమైంది. కార్యదర్శులకు ఆయా గ్రామాల సర్పంచులు పంచాయితీ రికార్డులను అందజేశారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహాకారంతో కార్యదర్శులు బాధ్యతలు చేపట్టి గ్రామాల అభివృద్దికి సహకరిచాలని కోరారు. అనేక చోట్ల సర్పంచులకు గౌరవ ప్రదంగా సాగనంపి కార్యదర్శులను ఆహ్వానించారు. కొత్త పంచాయితీల గ్రామాల్లా సందడి నెలకొంది. దీరారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కొత్త మున్సిపాల్టీలలో సంబందిత తహసీల్దార్లు,గ్రామ పంచాయితీలలో కార్యదర్శులు భాధ్యతలు తీసుకున్నారు. మెదక్ జిల్లాలో 320 పంచాయతీలుండగా 157 కొత్త పంచా యతీల ఏర్పాటుతో ఆ సంఖ్య 477కి పెరిగింది. ఇందులో ఎనిమిది పంచాయతీలను పక్కన పెట్టడంతో పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. కొన్ని పంచా యతీలు పురపాలక సంఘాలుగా మారడం, మరికొన్ని పురపాలక సంఘాల్లో విలీనం కావడం వల్ల వివిధ గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. మిగిలిన వాటికి ప్రత్యేక అధికారుల పాలన మొదలుకానుంది. వరం గల్ రూరల్ జిల్లా లోని 401 గ్రామ పం చా య తీ లకు ప్రత్యేక అధి కా రుల పాలన అధి కా రి కంగా నేడు ప్రత్యేక అధికారులు బాధ్య తలు చెప్ప ట్ట ను న్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రత్యేకాధికారుల పాలనను ప్రారంభించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. పాతపంచాయతీలతో పాటు కొత్తపంచాయతీల్లో కూడా ప్రత్యేకాధికారుల పాలన కొత్తకొత్తగా కొంగొత్తగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్దం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సర్పం చ్ లను పర్సన్ ఇన్‌ఛా ర్జీ లుగా నియ మిం చా లని సర్పం చ్‌లు మొర పె ట్టు కో వడం, మరో వైపు గ్రామ పం చా యతీ ఉద్యోగ కార్మి కులు నిర వ ధిక సమ్మెలో ఉండటంతో ప్రత్యేక అధి కా రుల పాల నకు అడ్డం కులు తప్ప వనే అభి ప్రా యాలు వ్యక్త మ వు తు న్నాయి