Search
Wednesday 21 November 2018
  • :
  • :

క్యాన్సర్ కణితుల గుర్తింపునకు కొత్త చిట్కా

New tip for identification of cancer tumors

లండన్ : మిశ్రమ లవణాలు కలిగిన ఒక పానీయం తాగితే దానివల్ల మెదడులో కణతులు ప్రకాశవంతమై సర్జరీలో సులువుగా గుర్తించడానికి డాక్టర్లకు ఉపకరిస్తుంది. ఆమేరకు సురక్షితంగా ఆ కణతులను తొలగించ వచ్చు. మెదడు క్యాన్సర్ సోకిన రోగులతో పరిశోధకులు సాగించిన పరిశోధనలో ఇది వెల్లడైంది. మెదడు లోని క్యాన్సర్ కణతులను సర్జరీ ద్వారా తొలగించడం ఒక సవాలుగా డాక్టర్లకు మారింది. మెదడు లోని ఆరోగ్యకరమైన కండరాలను మినహాయించి క్యాన్సర్ సోకిన కండరాలనే తొలగించడం చాలా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఫోరోసెంట్ మార్కర్ ఉపయోగిస్తే మెదడులోని ఇతర కండరాల కన్నా క్యాన్సర్ కణతులున్న కండరాలనే సర్జరీ లో గుర్తించవచ్చని వివరించారు. పరిశోధకులు 5అమినోలెవులినిక్ యాసిడ్ (5ఎఎల్‌ఎ) కాంపౌండ్‌ను ఉపయోగించగా అది గులాబీ రంగుతో ఎక్కడైతే లైట్‌ను చూపిస్తే అక్కడ వెలుగుతూ కణతులు కనిపించాయి.

ఇదివరకు పరిశోధనలో 8ఎఎల్‌ఎ ను వినియోగిస్తే అది పేరుకు పోయి క్యాన్సర్ కణాలు వేగంగా పెరగడం కనిపించింది. అంటే ఇది హైగ్రేడ్ కణాలను గుర్తించే ఫోరోసెంట్ మార్కర్‌గా నటిస్తుందని అర్థమవుతోంది. ఈ అధ్యయనంలో హైగ్రేడ్ మెదడు క్యాన్సర్ కణాలున్న రోగులను లండ న్‌లోని రాయల్ లివర్‌పూల్ ఆస్పత్రి, కింగ్స్ కాలేజీ ఆస్పత్రుల్లో చికిత్స చేశారు. ఈ రోగులు 23 నుంచి 77 సంవత్సరాల వయస్సు కలవారు.సరాసరి వయస్సు 59 సంవత్సరాలు. మెదడులోని క్యాన్సర్ కణుతులను తొలగించే సర్జరీకి ముందు ప్రతి రోగికి 5ఎఎల్‌ఎ పానీయాన్ని తాగించారు. సర్జన్లు మెదడులోని కణతులను తొలగించే సమయంలో మైక్రోస్కోప్‌లు ఉపయోగించి ప్రకాశవంతంగా కనిపించే కణతులను గుర్తించ గలిగారు. తొలగించిన ఆ కణతులను పాథాలజీ ప్రయోగశాలకు పంపించి సర్జన్లు చేసిన సర్జరీ సరిగ్గా ఉందని ధ్రువీకరించుకున్నారు.                                                                                                                                                                                                               – సైన్స్ విభాగం

New tip for identification of cancer tumors

Telangana Latest News

Comments

comments