Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కొత్త నల్లా కనెక్షను కావాలా…?

కనెక్షన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు
18 రోజుల్లో కనెక్షన్
దరఖాస్తు చేయడం ఇలా..

water

హైదరాబాద్ మహానగరంలో నీటి కనెక్షన్ తీసుకోవాలంటే జలమండలి కార్యాలయం చుట్టూ తిరగాలని, దరఖాస్తు చేయడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోందనే అపోహ చాలమందికి ఉంటుంది. ఇప్పడు నల్లా కనెక్షన్ పొందడం చాలా సులువుగా మారింది. ఇంటింటికీ మంచినీరు అందించాలనే లక్షంతో రాష్ట్రప్రభుత్వ అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమం కింద నగర శివారులో రిజర్వాయర్ల ఏర్పాటు, నల్లా కనెక్షన్లు ఇవ్వడం తదితర చర్యలను వేగవంతం చేసింది. ప్రస్తుతం నగరంలో నల్లా కనెక్షన్ కావాలనుకుంటే సమీపంలోని జలమండలికి చెందిన డివిజన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. లేకుంటే ఆన్‌లైన్‌లో డబ్లు.డబ్లు.డబ్లు.హైదరాబాద్ వాటర్.జీఓవీ.ఆన్ వైబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది. అలాగే వాటర్‌బోర్డుకు చెందిన హెచ్‌ఎండబ్లూస్‌ఎస్‌బీ సిటిజన్ సర్వీస్ ద్వారా కూడా నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్బన్‌మిషన్ భగీరథ కింద శివారు సర్కిళ్లలో కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులను వినియోగదారులకు అందించడానికి, నింపిన దరఖాస్తులను స్వీకరించడానికి బోర్డు సిబ్బంది. స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లు దరఖాస్తుదారుల ఇంటింటికి వెళ్తున్నారు. దారిద్యరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్లు ఇస్తుండగా, ఇతరులకు డొమెస్టిక్ కనెక్షన్‌కు ఇంటి స్ధల వైశాల్యం ఆధారంగా కనెక్షన్ కోసం 15మి.మీ పైపు పరిమాణానికి రూ.1000 నిర్వహణ రుసుం దరఖాస్తుతో పాటు చెల్లించాలి. 200 మి.మీ పైపు పరిమాణం గల కనెక్షన్ కోసం రూ.2000 రుసుం చెల్లించాలి. ఇంటి స్థ్ధల వైశాల్యం ఆధారంగా కనెక్షన్ ఛార్జీలుంటాయి. దరఖాస్తు చేసుకున్న 18 రోజుల్లో నల్లా కనెక్షన్ ఇస్తారు. గతంలో మూడు నెలలు ఉండగా ప్రస్తుతం తగ్గించారు.
డొమెస్టిక్ కనెక్షన్ కోసం కావాల్సిన పత్రాలు
రిజిస్టర్ డీడ్, జీహెచ్‌ఎంసీ మంజూరు చేసిన ప్లాను, జీహెచ్‌ఎంసీ టాక్స్ అసెస్‌మెంట్ నెంబర్, జీహెచ్‌ఎంసీ ఆక్యుపెన్సీ పత్రం, కరెంట్ బిల్లు, ఆధార్ కార్డు, అఫిడవిట్/నోటరీ.
కమర్షియల్ కనెక్షన్ కోసం
రిజిస్టర్ డీడ్, జీహెచ్‌ఎంసీ మంజూరు చేసిన ప్లాను, జీహెచ్‌ఎంసీ టాక్స్ అసెస్‌మెంట్ నెంబర్, జీహెచ్‌ఎంసీ ఆక్యుపెన్సీ పత్రం, కరెంట్ బిల్లు, ఆధార్ కార్డు, అఫిడవిట్/నోటరీ.
రెండో కనెక్షన్ కావాలంటే
రిజిస్టర్ డీడ్, రెండు కరెంట్ బిల్లులు, జీహెచ్‌ఎంసీ టాక్స్ అసెస్‌మెంట్ నెంబర్, ఇంటి ఏరియా ఫోటో, ఆధార్ కార్డు, ఆఫిడవిట్ /నోటరీ.
నిబంధనలు ఇవే
– ఇంటి సమీపంలోని బీటీ, సీసీ రోడ్డు ఉంటే వాటిని తవ్వాల్సి వస్తే కనెక్షన్ ఛార్జీలు కాకుండా రీస్టోరేషన్ చార్జీలను అదనంగా విధిస్తారు.
100 చదరపు మీటర్ల కంటే ఆదనంగా ఉండే భవనానికి గానీ, ఏడు మీటర్ల ఎత్తుకంటే ఎక్కువ ఉండే భవనానికి జీహెచ్‌ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే కనెక్షన్ తీసుకున్న తరువాత నీటి బిల్లు మూడు రెట్లు అదనంగా వసూలు చేస్తారు.
మొదట తీసుకున్న కనెక్షన్ ద్వారా 15 ఎంఎం పైపు పరిమాణం లేదా 20 ఎంఎం పైపు పరిమాణం ఉన్నా గానీ సరిపడా నీరు రాకుంటే పైపు పరిమాణం పెంచుకోవడానికి అవకాశముంది. ఇందుకోసం రూ.2 వేలు నిర్వహణ రుసుం చెల్లించాలి. కనెక్షన్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.
– జీ ప్లస్ 3 లోపు స్థల విస్తీర్ణాన్ని బట్టి రెండు కుటుంబాలు వేర్వేరుగా ఉంటే కరెంట్ బిల్లుల ఆధారంగా రెండో కనెక్షన్ ఇస్తారు. రెండో కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెయ్యి రూపాయల నిర్వహణ రుసుం చెల్లించాలి. కనెక్షన్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.
– బీపీఎల్ కుటుంబాలకు ఒక్క రూపాయి మినహా పైపుల కోసం, తవ్వడానికి డబ్బులు ఇవ్వకూడదు. డొమెస్టిక్ కనెక్షన్ల సందర్భంలో కనెక్షన్ ఛార్జీలు, రీస్టోరేషన్ ఛార్జీలు చెల్లించిన తరువాత పైపుల కోసం గానీ, తవ్వడానికి గానీ డబ్బులు ఇవ్వనవసరం లేదు.
– కనెక్షన్ పొందడంలో సమస్యలు, సందేహాలుంటే వాటర్ బోర్డు మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్‌లను సంప్రదించవచ్చు. సమస్య పరిష్కారమవ్వకుంటే కస్టమర్ కేర్ 155313కు ఫిర్యాదులు చేయవచ్చు.

ఎం. సతీష్‌ముదిరాజ్,
మనతెలంగాణ ప్రతినిధి

Comments

comments