Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తూర్పు హస్తంలోకి కొత్త నీరు

Congress-image

తెరమీదికి ‘యువనేత’
బరిలో నిలచేందుకు కసరత్తు
పాత కంటే కొత్తవారి వైపే అధిష్టానం మొగ్గు
అవకాశం కల్పించే చాన్స్ ఎక్కువే…!
ప్రజాదరణ కోసం ఆశావాహుల ప్రణాళికలు

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్‌లోకి కొత్త నీరు ప్రవేశిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ  యువనేతలు తెరమీదికొస్తున్నారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్‌లో నిత్యం పలు కార్యక్రమాలు నిర్వహించే నేతలున్నప్పటికీ ప్రజల విశ్వాసాన్ని పొందే స్థాయిలో వారు లేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరో నేత అధికార పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం విదితమే. అయితే తూర్పులో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో ప్రజాపునాది ఉన్న నాయకత్వం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీలో నూ టిక్కెట్ గోల ఎక్కువగానే ఉండటం గమనార్హం. దీంతో ఎన్నికల నాటికి అధికార పక్షం నుంచి కాం గ్రెస్‌లోకి ఓ బలమైన నేత షిప్ట్ అయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లోకి కొత్త నీరు సైతం ప్రవేశించడానికి సిద్దపడటం గమనార్హం. ఎలాంటి రాజకీయ మరకలు లేకుండా నూతన రంగ ప్రవేశానికి ఓ యువ నేత రంగం సిద్దం చేసుకుంటున్నారనేది వారి కదలికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రజలతో మమేకమవడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజకీయాలకతీతంగా పరిష్కరించడానికి ప్రయత్నించడం ప్రజలలో ఆలోచనలను రేకితిస్తోంది. నిన్నటి వరకు ఉన్న వేసవి కాలంలో పలు ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, తూర్పు నియోజకవర్గంలో ఉన్న పలు ప్రాంతాలలో నీటి కొరత ఉన్న ఏరియాలకు ట్యాంకర్ ద్వారా నీటిని సఫ్లైం చేయడం లాంటి అంశాలు రాజకీయ రంగం ప్రవేశానికి సూచికలుగా ప్రజలు భావిస్తున్నారు. నిన్నటికి నిన్న జరిగిన రంజాన్ వేడుకల సందర్భంలోనూ చీరలను పంచటం, బియ్యం పంపిణీ చేసి ఆకర్శన పొందే కార్యక్రమాలు నిర్వహించటం గమనార్హం. అయితే విద్యావంతుడైన ఆ యువనేతకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆశీస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో తూర్పులో కాంగ్రెస్‌కు స్థానికంగా సరైన నాయకుడు లేరనే అభిప్రాయాలు బలపడటం, ఉన్న వారు పోటిలో ఉంటే విజయం వరిస్తుందనే గ్యారంటీ లేకపోవడంతో కొత్తవారికే అవకాశాలిచేందుకు అధిష్టానం సుముకంగా ఉందని కాంగ్రెస్ వర్గీయులే గుసగుసలాడటం గమనార్హం. అయితే కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశించిన వారిలో ప్రధానంగా ఓ యువనేత పేరు తెరమీదికి రావడం చర్చానీయాంశంగా మారుతోంది. గత కొంత కాలంల నుంచి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రజలతో నిత్య సంబంధాలు కొనసాగిస్తు సేవ కార్యక్రమాలతో జనం నాలుకలో నానటం రానున్న ఎన్నికల బరిలో నిలుస్తున్నాననే సంకేతాలిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ రానున్న ఎన్నికలలో తూర్పు కాంగ్రెస్‌లోకి కొత్త నీరు రావడం ఖాయమని స్పష్టమవుతోంది. అటు అధిష్టానం అంగీకరించడం తప్పదని, జనం సైతం కొత్తవారికి అవకాశావ్వడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయాలుండటం గమనార్హం.

Comments

comments