Search
Wednesday 21 November 2018
  • :
  • :

భారత్ లోనే శక్తివంతమైన ప్రధాని కాగలరు…

New York Times has published the story of India's future Prime Minister Baba Ramdev

న్యూఢిల్లీ: ఇండియాలో యోగా గురు బాబా రాందేవ్ కు తిరుగులేని ఆదరణ ఉందని, ప్రపంచంలోని నలుమూలల్లో పేరు ప్రఖ్యాతలను గావించారని ప్రముఖ అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. రాందేవ్ సాధించిన విజయాలు, భారతదేశంలో అతని ప్రభావం గురించి చెబుతూ… రాందేవ్ ఇండియాకు కాబోయే ప్రధాని  అని పేర్కొంది. ”ది బిలియనీర్ యోగి బిహైండ్ మోడీస్ రైజ్” (మోడీ ఎదుగుదల వెనుక సంపన్న యోగి) అనే పేరుతో ఈ కథనాన్ని వెలువరించింది. ఇండియాతో పాటు ఇతర దేశాల దృష్టిని ఆకర్షించడాన్ని బాబా రాందేవ్ కృషి చేస్తున్నారని కథనం ద్వారా వెల్లడించింది. ఇదివరకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పత్రికల్లో బాబా రాందేవ్ పేరిట అనేక కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ఇండియాలో బాబా రాందేవ్ ఓ ప్రత్యేక శక్తిగా అవతరిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. తనకు తానుగా భారత ప్రధాని రేసులోకి ఉన్నారన్న చర్చ రాందేవ్ పై జరుగుతుందని స్పష్టం చేసింది. ట్రంప్ తో రాందేవ్ పోల్చడంపై విశ్లేషిస్తూ… ట్రంప్ మాదిరే రాందేవ్ కూడా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపత్యం వహిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. భారత్ లో రాందేవ్ కు తిరుగులేని ఆదరణ ఉందని దేశంలోని ప్రతి చోట అతని పేరు, ముఖం కనిపిస్తుందని చెప్పింది. భారత్ లోనే అత్యంత శక్తివంతమైన ప్రధాని కాగలడని తెలిపింది.

Comments

comments