Home తాజా వార్తలు తొలి వికెట్ కోల్పోయిన కివీస్

తొలి వికెట్ కోల్పోయిన కివీస్

Guptilమొహాలీ: న్యూజిలాండ్‌తో మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మొదట టాస్ గెలిచి బౌలింగ్‌కు దిగిన టీమిండియా బౌలర్లను కివీస్ ఓపెనర్లు కాసేపు ధాటిగానే ఎదుర్కొన్నారు. గుప్టిల్, లాథమ్ సిక్సర్లతో చెలరేగారు. మొదటి ఆరు ఓవర్లలో 38 పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతున్న మార్టిన్ గుప్టిల్ (27: 2×4,2×6) వద్ద భారత బౌలర్ ఉమేష్ యాదవ్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ప్రత్యర్థి జట్టు 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో లాథమ్(18), విలియమ్సన్(7)ఉండగా, కివీస్ స్కోర్: 54/1(8 ఓవర్లు).