Home తాజా వార్తలు బతుకమ్మ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని..

బతుకమ్మ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని..

bathukamma

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు విదేశాలకూ విస్తరించిన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. జెసిండా నుదుటన బొట్టు పెట్టుకొని, బతుకమ్మ చుట్టూ తిరిగి గౌరమ్మకు పూజ చేశారు. అక్కడి తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రపంచ చరిత్రలోనే బతుకమ్మ సంబురాల్లో ఓ దేశ ప్రధాని ఆడిపాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌లో బతుకమ్మ వేడుకల నిర్వహణపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించి, బతుకమ్మ ఆడిన ప్రధాని జెసిండాకు ఈ సందర్భంగా కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

new zealand vice president participate in Bathukamma