Home తాజా వార్తలు కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం

కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం

Telangana has massive plans to go green

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు కేంద్రం అంగీకరించింది. మొదటి మల్టీ జోన్‌లో కాళేశ్వరం, బాసర, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి, రెండో మల్టీ జోన్‌లో యాదాద్రి, చార్మినార్, జోగులాంబాలున్నాయి.  మొదటి జోన్ కాళేశ్వరంలో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జయశంకర్, రెండో జోన్ బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మూడో జోన్ రాజన్నలో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నాలుగో జోన్ భద్రాద్రిలో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ , వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు, ఐదో జోన్ యాద్రాద్రిలో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి యాద్రాద్రి, జనగాం, ఆరోజోన్ చార్మినార్‌లో మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఏడో జోన్ జోగులాంబలో వికారాబాద్, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.