Home జోగులాంబ గద్వాల్ చెట్ల పొదల్లో పసికందు

చెట్ల పొదల్లో పసికందు

Newbornజోగులాంబ గద్వాల : గద్వాల్ కొత్త బస్టాండ్ సమీపంలోని చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన బాబును దుండగులు ప్లాస్టిక్ కవర్లో పెట్టి వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక ప్రజలు  పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు  సమాచారం అందించారు. అధికారులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం ఆ బాబును గద్వాల్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆ బాబును  ఐసీడీఎస్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Newborn found abandoned in bushes at Gadwal