Home తాజా వార్తలు బంజారాహిల్స్‌లో నవదంపతుల ఆత్మహత్య

బంజారాహిల్స్‌లో నవదంపతుల ఆత్మహత్య

Suicideహైదరాబాద్: ఇటీవలే పెళ్ళి చేసుకున్న నవదంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి కరీం నగర్ జిల్లా ,గోదావరి ఖనికి చెందిన అర్చన (25),సంతోష్ (30)లు గత మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. వీరిరువురు ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఎన్‌బిటి నగర్‌లో నివాసం ఉంటున్నారు.శనివారం మధ్యాహ్న సమయంలో ఇంటి పక్కన నివాసం ఉండే వారు వచ్చి వారి ఇంటి తలుపును తట్టగా ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటికి వచ్చి ఇంటి తలుపులను బద్దలు కొట్టి చూడగా ఇంట్లోని దూలానికి ఇరువురు తాడుతో వేలాడుతూ ఆత్మహత్య చేసుకుని విగతజీవులుగా కనిపించారు. దీంతో వారిరువురి మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.వారి ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియడం లేదని విచారణలో పూర్తి విషయాలు వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Newly Married Couple Commits Suicide In Banjara Hills