Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

నవ వధువు ఆత్మహత్య

Newly Married Woman Commits Suicide

మేడ్చల్ : ఓ నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపూర్‌కు చెందిన రమేశ్‌తో రామాంతాపూర్‌కు చెందిన రెబ్బ అక్షిత అలియాస్ మౌనిక (22)తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. రమేశ్, మౌనిక దంపతులు బోడుప్పల్ లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు. రమేశ్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇంట్లో భర్త లేని సమయంలో మౌనిక ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఎడబాటు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన ఆత్మహత్యతో భర్త రమేశ్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Newly Married Woman Commits Suicide

Comments

comments