Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

నవవధువు బలవన్మరణం

SUICIDE

హైదరాబాద్: పెళ్లైన నాల్గు నెలలకే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవ పడేవారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు నీరజా రెడ్డికి జీడిమెట్లకు చెందిన సుచిన్ రెడ్డితో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహం జరిగింది. నీరజా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments