Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నవ వధువు బలవన్మరణం

Suspicious-Death-image-done

సూర్యాపేట: పెళ్లైన ఆరునెలలకే నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్‌పి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసే కిరణ్‌తో భవానికి ఆరు నెలల క్రితం వివాహమైంది. అయితే భవాని ఆదివారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుపక్కలవాళ్లు భవాని ఇంటికెళ్లి తలుపు కొట్టగా ఎంతకు తీయలేదు. దాంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ కూతురు భర్త కిరణ్ వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడిదంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments

comments