Home జాతీయ వార్తలు నవవధువుపై గ్యాంగ్ రేప్..!

నవవధువుపై గ్యాంగ్ రేప్..!

Newly Married Woman gang raped in Tamilnadu

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. నలుగురు యువకులు గుడికి వెళ్లి వస్తున్న నవ దంపతులపై దాడి చేశారు. అనంతరం భర్త కళ్ల ముందే భార్యపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే…  తిరువల్లూరు గ్రామానికి చెందిన ఇటీవలె వివాహమైన కొత్తజంట సోమవారం సాయంత్రం వేళ ఊరికి సమీపంలోని ఆలయానికి వెళ్లారు. పూజలు చేసిన తరువాత తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో అప్పటికే చీకటి పడింది. అదే సమయంలో అటుగా వచ్చిన నలుగురు యువకులు హఠాత్తుగా వారిని అడ్డుకున్నారు. యువకుడిపై విచక్షణ రహితంగా కత్తితో దాడిచేసి పక్కన పడేశారు. అనంతరం  యువతిని రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్దిసేపటి తరువాత తెరుకున్న యువకుడు కేకలు వేసుకుంటూ సమీపంలోని గ్రామానికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. దాంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి వెళ్లారు. గ్రామస్థులు రావడం చూసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం.

Newly Married Woman gang raped in Tamilnadu.