Home సినిమా కునాల్ తనదైన స్టయిల్లో తెరకెక్కించారు

కునాల్ తనదైన స్టయిల్లో తెరకెక్కించారు

సందీప్ కిషన్, తమన్నా, నవదీప్, పూనమ్‌కౌర్ ప్రధాన తారాగణంగా కునాల్ కోహ్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్ ఏంటి’. వైకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి., అక్షయ్ పురి ప్రొడక్షన్స్ పతాకాలపై రైనా జోషి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ “దర్శకుడు కునాల్ కోహ్లీ తెరకెక్కిన హమ్ తుమ్, ఫనా చిత్రాలంటే నాకెంతో ఇష్టం. ఆయన దర్శకత్వంలో తమన్నాతో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. లవ్, సెక్స్ గురించి ఈ సినిమా ఉంటుంది. సరదాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. కునాల్ తనదైన స్టయిల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు”అని అన్నారు. తమన్నా మాట్లాడుతూ “సందీప్, నవదీప్ చాలా చక్కగా నటించారు. కునాల్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది”అని తెలిపారు. అక్షయ్‌పురి మాట్లాడుతూ “పాటలు, ట్రైలర్ చూసిన తర్వాత కునాల్ తనదైన స్టయిల్లో సినిమాను ఎంత బాగా తెరకెక్కించారనే విషయం అర్థమవుతుంది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కునాల్ కోహ్లీ, లియోస్, రైనా జోషి తదితరులు పాల్గొన్నారు.

Next Enti Movie Pre Release Event Celebration 

Telangana News