Search
Friday 16 November 2018
  • :
  • :

‘నెక్ట్ నువ్వే’ పాటల సందడి

Next-Nuvveగీతా ఆర్ట్, యు.వి. క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి ప్రారంభించిన కొత్త చిత్ర నిర్మాణ సంస్థ వి4 క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న హార్రర్ ఎంటర్‌టైనర్ ‘నెక్ట్ నువ్వే’. ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టివి యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకుడు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 3న విడుదలకానుంది. సాయికార్తీక్ సంగీతమందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ “తెలుగులో కాన్సెప్ట్ సినిమాలను ప్రోత్సహించడానికే వి4 సంస్థ వచ్చింది. ఈ సినిమా విడుదలయ్యేలోపు కొత్త కాన్సెప్ట్ సినిమాలున్నవారు మమ్మల్ని ఎలా సంప్రదించవచ్చో చెబుతాను. సాయికార్తీక్ ఈ సినిమాకు చాలా మంచి సంగీతాన్ని అందించాడు”అని అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ “ఈ సినిమా టైటిల్‌లోనే అసలైన మజా, సక్సెస్ ఉంది. సాయికార్తీక్ సంగీతం అద్భుతంగా ఉంది. థియేటర్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రేక్షకులు వచ్చేలా సినిమా ఉంటుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను”అని చెప్పారు. సాయికుమార్ మాట్లాడుతూ “గీతాఆర్ట్‌లో ఆది హీరోగా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. దర్శకుడు ప్రభాకర్ చాలా లక్కీ. ఈ సినిమా తర్వాత ఆది తమిళ్ సినిమాల్లోకి ప్రవేశిస్తున్నాడు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులు కోరుకునే సినిమాను అందించారు. ఆదికి ఇది మంచి సినిమా అవుతుంది”అని చెప్పారు. దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ “అదృష్టవశాత్తు నాకు ఈ సినిమా డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా చాలా బాగా వచ్చింది. ఆదిలాంటి హీరో దొరకడం అదృష్టం. తను ఒప్పుకున్న తర్వాతే సినిమాకు పాపులారిటీ వచ్చింది”అని పేర్కొన్నారు. బన్నీవాసు మాట్లాడుతూ “ఈ సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు నవ్వుతూనే ఉంటాడు. ప్రభాకర్ సినిమాను బాగా హ్యాండిల్ చేశారు. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించారు”అని అన్నారు. హీరో ఆది మాట్లాడుతూ “నలుగురు పెద్ద నిర్మాతలు కలిసి చేస్తోన్న సినిమా ఇది. ప్రభాకర్‌కు మొదటి సినిమా అయినా ఓ అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమా చేశారు. నవంబర్ 3న సినిమా విడుదలకానుంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మారుతి, నిరుపమ్, కె.కె, సాగర్, హిమజ, కార్తీక్ పళని, హిమజ, రష్మీ, వైభవి, పరుశురాం బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments