Home సినిమా విజయ దశమి కానుకగా ‘నెక్ట్స్ నువ్వే’

విజయ దశమి కానుకగా ‘నెక్ట్స్ నువ్వే’

Next-Nuvve

ఆది సాయికుమార్ హీరోగా వి4 మూవీస్ బ్యానర్‌లో పి.ప్రభాకర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ హిలేరియస్ కామెడీ థ్రిల్లర్‌లో వైభవి, రష్మీలు హీరోయిన్లు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఈ చిత్రాన్ని విజయ దశమి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ “వి4 మూవీస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నం.1గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘నెక్స్ నువ్వే’. ఆది సాయికుమార్ పాత్ర చాలా బావుంటుంది. అతని కెరీర్‌లో ఇది ఓ మంచి చిత్రంగా నిలుస్తుంది. వైభవి, రష్మీ, అవసరాల శ్రీనివాస్, బ్రహ్మాజీ, రఘు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. విజయ దశమి సందర్భంగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశాం”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: కార్తిక్ పళని, కథ: డికె, మాటలు: శ్రీకాంత్ విస్సా, నిరుపమ్ పరిటాల, పాటలు: కెకె, ఎడిటింగ్: ఎస్‌బి ఉద్దవ్.