Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రక్షణ రంగంలో ఎన్‌ఎఫ్‌సి సేవలు

 NFC services in the defense sector

చర్లపల్లి: కేంద్ర ప్రభుత్వ సంస్ధ అణు ఇందన సంస్ధ న్యూక్లియర్ ప్యూయల్ కంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సి) జాతీయ అంతర్ జాతీయ స్ధాయిలో గుర్తింపు పొందుతుందని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (ముంబయి) అటామిక్ ఎనర్జీ కమిషన్ సభ్యులు కె.ఎన్. వ్యాస్ అన్నారు. శుక్రవారం ఎన్‌ఫ్‌సి 45వ వార్షికోత్సవాన్ని డిఏఈ కాలనీలోని డాక్టర్ హోమి జే బాబా కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెఎన్ వ్యాస్, గౌరవ అతిథిగా హెవీ వాటర్ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ కామాబి ముదాలిలు పాల్గొన్నారు. ఈసందర్భంగా వ్యాస్ మాట్లాడుతూ దేశ రక్షణ విభాగానికి చెందిన పలు క్షీపణి, మిసైల్, రాకెట్ , పృధ్వీ, నాగ్ వంటి ఎన్నో ఉపగ్రహలలో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించినందుకు జాతీయ స్ధాయిలో ఎన్‌ఎఫ్‌సికి గుర్తింపు వచ్చిందని అన్నారు. ఎన్‌ఎఫ్‌సి చీఫ్ ఎక్జిక్యూటివ్ దినేష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ పిహెచ్ డబ్లు, ఆర్‌ఆర్ ఇందన సముదాయాలతో కలసి ఎన్‌ఎఫ్‌సి యురేనియం, జిర్కోనియం, అక్సైడ్ పౌడర్లు వంటి ఎన్నో ఉత్పత్తులను రూపోందించిందని అన్నారు. ఈసందర్భంగా 2017-18 సంవత్సరంలో సంస్ధ సాధించిన విజయాలను వివరించారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో భాంగంగా ఎలక్ట్రానిక్ బోం వెల్డింగ్ యాత్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని స్వదేశంలో తక్కువ ధరకే తయారు చేసిన ఘనత ఎన్‌ఎఫ్‌సికి దక్కిందని అన్నారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు హైదరాబాద్‌తో పాటు రాజస్ధాన్‌లోని కోటాలో మరో సంస్ధను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈసందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపర్చిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అధికారులు ఫణిబాబు, డి. ప్రమణిక్, ఎన్‌ఎఫ్‌సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

comments