Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

శ్రీరెడ్డిపై ‘ మా ’ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఎన్‌హెచ్‌ఆర్‌సి

SRIREDDY

హైదరాబాద్ : సిని పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఆరోపిస్తూ నటి శ్రీరెడ్డి గళమెత్తిన విషయం తెలిసిందే. సినిమాల నుంచి శ్రీరెడ్డిని బహిష్కరిస్తూ ‘ మా ’ తీసుకున్న నిర్ణయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) తప్పుబట్టింది. సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిని అడ్డుకోవడం , ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని కమిషన్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఆర్‌సి తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారాల శాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సికి శ్రీరెడ్డి ఫిర్యాదు చేయనప్పటికీ, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ కేసును ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

NHRC Comments on Actress Srireddy Issue

Comments

comments