Search
Friday 21 September 2018
  • :
  • :

తెలంగాణ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు

NHRCన్యూఢిలీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కంటి శుక్లాల తొలగింపు శస్త్ర చికిత్స వికటించిన ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సి సీరియస్‌గా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతోపాటు రెండు వారాల్లోగా తుది నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర సిఎస్‌తోపాటు వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ఆస్పత్రి సూపరింటెండెంట్, డిజిపికి ఆదేశాలు జారీ చేసింది. గత నెల 30న సరోజినీ దేవి ఆస్పత్రిలో 21 మంది కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. రింగర్స్ లాక్టేట్(ఆర్‌ఎల్) సెలెన్‌వాటర్‌తో కళ్లను శుభ్రం చేయడం వల్ల 13 మందికి ఇన్‌ఫెక్షన్ సోకింది. దీంతో ఏడుగురి కంటి చూపు పోయింది. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తోపాటు లోకాయుక్తా విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Comments

comments