Search
Friday 21 September 2018
  • :
  • :

విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్‌సి

NHRC-1

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఎపిలలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని కూడా కోరింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. కాలేజీల యాజమాన్యాలకు భయపడి ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవణ్‌కుమార్ ఎన్‌హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎపికి చెందిన ఓ మంత్రికి కాలేజీలు ఉండడం వల్ల ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

NHRC Requested Report on Students Suicides

Comments

comments