Home జాతీయ వార్తలు పాకిస్థానీ మహిళ వాంగ్మూలానికి వీలు

పాకిస్థానీ మహిళ వాంగ్మూలానికి వీలు

 Samjhauta Express Blast Case

పంచకుల /న్యూఢిల్లీ : 2007 ఫిబ్రవరి 18వ తేదీ నాటి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో తీర్పు రిజర్వ్ చేశారు. దీనిని కేసు తదుపరి విచారణ సందర్భంగా ఈ నెల 14వ తేదీన వెలువరించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) న్యాయస్థానం సోమవారం తీర్పును వాయిదా వేసింది. హర్యానాలోని పానీపట్టు వద్ద రైలులో జరిగిన పేలుడులో 68 మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. విచారణల ప్రక్రియ ముగిసి కేసు ఇప్పుడు తీర్పు దశకు చేరింది. ఈ తరుణంలోనే పాకిస్థానీ మహిళ రహీలా వాకిల్ ఈ ఘటనలో సాక్షిగా తన వాంగ్మూలం కూడా నమోదు చేసుకోవాలని అభ్యర్థించింది ఆమె తరఫు న్యాయవాది ఒకరు ఈ విషయాన్ని న్యాయస్థానానికి తెలియచేసుకున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి ఖరారు చేసిన నియా ప్రత్యేక న్యాయస్థానం తీర్పురు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయి స్వామి అసీమానంద్ కూడా సోమవారం కోర్టు రూలింగ్ మధ్య అక్కడే ఉన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మరో ముగ్గురు నిందితులు కమల్ చౌహాన్, రాజీందర్ చౌదరీ, లోకేశ్ శర్మలను కోర్టుకు తీసుకువచ్చారు.

అప్పటి ఈ పేలుడు మృతులలో పలువురు పాకిస్థానీయులు, భారతీయ పౌరులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. హోం మంత్రిత్వశాఖ ఆదేశాలతో నియా ప్రత్యేక బృందం పరిధిలో ఈ ఘటనపై విచారణ జరిగింది. భారత్ పాకిస్థాన్ మధ్య సృహద్భావ సంకేతంగా ఢిల్లీ లాహోర్ మధ్క ఈ సంఝౌత ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. హర్యానాలోని పానీపట్టు వద్ద ఐఇడి పేలుడుతో బీభత్సం జరిగింది. మృతులలో అత్యధికంగా 43 మంది పాకిస్థానీయులు, పది మంది భారతీయులు, 15 మంది గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమాధికారతను దెబ్బతీసే విధంగా నేరపూరిత కుట్రలో భాగంగా ఈ ఉగ్రవాద చర్య జరిగిందని ఎన్‌ఐఎ తెలిపింది. అత్యంత రహస్యంగా నలుగురు కీలక నిందితుల సుదీర్ఘ విచారణలు, అసంఖ్యాకంగా సాక్షుల వాంగ్మూలాలు తీసుకుంటూ విచారణ ప్రక్రియ జరిగింది. ఇప్పుడు అప్పటి రైలు ప్రయాణంలో తండ్రి చనిపొయ్యాడని తన వాంగ్మూలాన్ని తీసుకోవాలని పాకిస్థానీ మహిళ పిటిషన్ వేయడం ఈ రెండు దేశాల మధ్య సాగుతోన్న ఈ కీలక కేసులో మలుపుగా మారింది.

ఈ కేసులో మొత్తం 13 మంది పాకిస్థానీయులు తమ వాంగూల్మం ఇచ్చుకున్నారు. ఇక ఇప్పటి పిటిషనర్ రహీలా వాకిల్ అప్పటి దుర్ఘటనలో బాధిత వ్యక్తి కూతురు కావడంతో ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని నియా కోర్టు నిర్ణయించింది. పిటిషన్‌పై వివరణ ఇచ్చుకోవాలని నియాను, నిందితులను ఆదేశిస్తూ నోటీసులు పంపించింది.

NIA Court Defers Verdict in Samjhauta Express Blast Case