Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సంప్రదాయబద్ధంగా నిశ్చితార్థం

Nick Jonas and Priyanka Chopra make their engagement

ఎంతోకాలంగా ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ల నిశ్చితార్థం జరిగింది. ముంబయిలోని ప్రియాంక నివాసంలో పం జాబీ సంప్రదాయ పద్ధతిలో జరిగిన రోకా పూజా కార్యక్రమం అనంతరం ఈ జంట తమ ఎంగేజ్‌మెంట్ జరిగిందని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పరిణితి చోప్రాతో పాటు ప్రియాంక, నిక్ కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. అయితే శనివారం రాత్రి ప్రియాంక పెద్ద పార్టీ ఏర్పాటుచేసింది. ఇందు లో నిక్ తల్లిదండ్రులు డెనిస్, కెవిన్ జోనాస్‌తో పాటు రణవీర్‌సింగ్, కరణ్‌జోహార్  తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు. మొత్తానికి ప్రియాంక చోప్రా తనకన్నా పదేళ్ల చిన్నవాడైన నిక్‌ను త్వరలో పెళ్లి చేసుకోనుంది.

Comments

comments