Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

టాలీవుడ్‌లోకి నిధి అగర్వాల్

Nidhhi-Agerwalప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న నాగచైతన్య ఆతర్వాత ‘యుద్ధం శరణం’తో నిరాశచెందాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘ప్రేమమ్’తో హిట్‌నిచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో కథానాయికగా ఓ బాలీవుడ్ భామను ఫైనల్ చేశారు. ఆమె ఎవరో కాదు టైగర్ ష్రాఫ్‌తో ‘మున్నా మైఖేల్’ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన భామ నిధి అగర్వాల్. ఈ సినిమా అమ్మడికి సక్సెస్‌ను అందించలేకపోయింది. కానీ ఈ బ్యూటీ అందాలకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక తన నెక్స్ సినిమా ఎంపికలో నిధి కాస్త ఆలస్యం చేసింది. చివరికి దర్శకుడు చందు మొండేటి చెప్పిన కథను ఈ హాట్ బ్యూటీ ఓకే చేసిందట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిసింది. సరికొత్త కథాంశంతో తెరకెక్కే ఈ సినిమాలో మాధవన్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల మూడవ వారంలో మొదలుకానుంది. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Comments

comments