Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

డ్రగ్స్ మత్తులో నైజీరియన్ యువతి హంగామా(వీడియో)

Nigerian-womanబెంగళూరు: నగరంలోని మార్కెట్ ప్రాంతంలో ఓ నైజీరియన్ యువతి డ్రగ్స్ మత్తులో నానా హంగామా చేసింది. ముందుగా ఓ షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించిన యువతి అక్కడి సామాన్లను చేతికందిన వాటిని నేలకేసి కొట్టడమే కాకుండా అడ్డు చెప్పిన వారిపై దాడికి యత్నించింది. దీంతో అక్కడి వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతిని అదుపు చేసేందుకు ప్రయత్నించినా అదుపు చేయలేకపోయారు. చివరకు లేడీ కానిస్టేబుళ్లను పిలిపించి ఆమెను కట్టడి చేసేందుకు ప్రయత్నించినా గానీ వారికి వినలేదు. దాంతో ఓ వ్యక్తి వెనుక వైపు నుంచి వెళ్లి ఆమెపై ఒక బట్టతో ముసుగేసి కిందపడేసి బందించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

Comments

comments