Search
Wednesday 26 September 2018
  • :
  • :

‘సైరా’లో కీలకమైన పాత్రలో…

niharika

మెగా బ్రదర్ నాగేంద్రబాబు కూతురు నీహారిక కొణిదెల  సినిమాల్లో హీరోయిన్‌గా ప్రవేశించి దాదాపు రెండేళ్లు అవుతుంది. ‘ఒక మనసు’ మూవీతో హీరోయిన్‌గా మారిన ఆమె ఆతర్వాత మళ్లీ తెలుగు సినిమా ఏదీ చేయలేదు. ఓ తమిళ్ మూవీలో నటించినా తెలుగు సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటోంది. అయితే ఇప్పుడు నిహారికకు పెద్ద ఆఫర్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో ఆమెకు ఓ కీలకమైన పాత్ర ఇచ్చారట. పెదనాన్న సినిమాలో ఓ పాత్ర చేయాలనే ఆఫర్ వినగానే ఆమె ఎంతో సంతోషపడిపోయిందట. ఈ చిత్రంలో ఓ  కీలకమైన పాత్రలో నిహారిక నటించనుందని సమాచారం. టాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘సైరా’. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌ను ఈ సినిమా కోసం వెచ్చిస్తున్నాడు నిర్మాత రామ్‌చరణ్. అంతటి పెద్ద ప్రాజెక్టులో నటించే ఆఫర్ దక్కడంతో నిహారిక ఆనందానికి అవధుల్లేవట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైరా’ చిత్రంలో నిహారిక పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని తెలిసింది.

Comments

comments