Home రాష్ట్ర వార్తలు మెదక్ జిల్లాలో నిమ్జ్

మెదక్ జిల్లాలో నిమ్జ్

Untitled-1.jpg52కేంద్రం ఉత్తర్వులు జారీ, ఫార్మా నిమ్జ్‌కూ త్వరలో లైన్‌క్లియర్, రూ.62,300 కోట్ల పెట్టుబడులు, 4.86 లక్షల ఉద్యోగాలు, హైదరాబాద్ పరిసరాల్లో 4 సెజ్‌లు : నిర్మలా  సీతారామన్

 న్యూఢిల్లీ : హైదరాబాద్‌పై కేంద్రం వరాల జల్లు కురి పించింది. హైదారాబాద్ పరిసర ప్రాం తాల్లో నాలుగు ఎస్.ఇ.జడ్‌లతో పాటు మెదక్ జిల్లాలో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (ఎన్.ఐ. ఎం.జడ్) ఏర్పాటుకు కేంద్రం తుది ఉత్త ర్వులు జారీ చేసింది. ఈ జోన్ ద్వారా రాష్ట్రానికి రూ.17,300 కోట్లు పెట్టుబడు లు వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణి జ్య శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ జోన్ పరిధిలో ఏటా అరవై వేల కోట్ల టర్నోవర్ జరుగుతుందని చెప్పారు. ఈ జోన్ ద్వారా ప్రత్యక్షంగా 1.1 లక్షల మందికి పరోక్షంగా 1.5 లక్ష ల మందికి మొత్తం 2.61 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. జోన్ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అ త్యున్నత స్థాయిలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. జోన్ ఏర్పాటుతో సరకు రవాణా కోసం అంతర్జాతీ య ప్రమాణాలతో రవాణ వ్యవస్థ సిద్ధం అవుతుందని చెప్పా రు. ప్రధానంగా ఫార్మా, ఇంజనీరింగ్, టెక్సైటైల్స్, ఎలక్ట్రానిక్ అండ్ టెలీ కమ్యూనికేషన్ హార్డ్‌వేర్, రక్షణ, ఎయిరో స్పెసెస్ పరిశ్రమలు ఆకర్శించే అవకాశం ఉందని చెప్పారు. ఈ పాటికే ఎయిరో స్పెస్ సంస్థలను ఆకర్శించడంలో ప్రథమ స్థానంలో ఉన్న హైదారాబద్ ఇకపై ఎన్.ఐ.ఎం.జడ్ జోన్ ఏర్పాటుతో ఎ యిర్ స్పెస్ పరిశ్రమలు హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా వర కు విస్తరిస్తాయని చెప్పారు. ఇంత కాలం సాఫ్ట్ రంగంలో ముం దు వరుసలో ఉన్న హైదరాబాద్ ఇకపై హార్డ్‌వేర్ రంగంలో కూడా అడుగు పెట్టబోతోందని చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఫార్మా ఎన్.ఐ.ఎం.జడ్ ఏర్పాటుకు కూడా కేంద్రం సూత్రప్రా యంగా అంగీకరించిందని చెప్పారు. త్వరలోనే తుది ఉత్తర్వు లు వెలువడుతాయని చెప్పారు. ఈ ఫార్మా ఎన్.ఐ.ఎం.జడ్ ద్వారా మొత్తం నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడు లను ఆకర్శించే అవకాశం ఉందని చెప్పారు. రెండున్నర లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుందని తెలిపారు. ఫస్ట్ ఫేస్ పను లు పూర్తి అయిన తర్వాత ఉపాధి అవకాశాలు ప్రారంభం అవు తాయని చెప్పారు. గతంలో కేంద్రం ఆమోదించిన పాశమైలా రం పారిశ్రామిక వాడల్లో ప్యాడీ ప్రాసెసింగ్ క్లస్టర్, మాడిఫైడ్ ఇండస్ట్రియల్ ఇన్పాస్ట్రక్చర్ అప్‌గ్రెడేషన్ స్కీం కింద రంగా రెడ్డి జిల్లాలో ఇండస్ట్రియల్ క్లస్టర్లకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యా యని చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంత్రి డెవల పర్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్, వ్యాల్యూ ల్యాబ్స్ ఇఫ్రా పేరుతో ఏర్పాటు కానున్న సెజ్లతో హైదరాబాద్ పారిశ్రామికంగా , వాణిజ్య పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.