Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

పంజాబ్‌లో విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ

Nine-students-run-over-by-s

చండీగఢ్: పంజాబ్‌లోని భటిండా జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన నిల్చున్న విద్యార్థులపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడ మృతిచెందగా, మరికొంత మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. భటిండాలోని బుచోమండి వద్ద ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో లారీ డ్రైవర్‌కు సరిగ్గా కనిపించకపోవడంతోనే ప్రమాదం సంభవించిన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Nine students killed as truck crushes them in Punjab’s Bathinda district.

Comments

comments