Home జాతీయ వార్తలు తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం,ఆపై హత్య

తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం,ఆపై హత్య

Nine-year-old girl raped, killed in Bihar in third incident

పట్నా: పశువులను మేపడానికి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన 9 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం, ఆపై  హత్య చేసిన ఘటన బిహార్ లోని ముజపర్ నగర్ జిల్లాలోని పారు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. అడ్డుగా వచ్చిన  చిన్నారి తమ్ముడి ని సైతం దుండగులు చంపి వేశారు. ఈ హత్యలు రెండు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న గొడవల కారణంగా జరిగి ఉంటుందని ముజఫర్ నగర్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల పక్రారం.. ఆదివారం సాయంత్రం పశువులను మేపడానికి తమ్ముడితో పొలం వద్దకు వెళ్లిన చిన్నారిపై దుండగులు అత్యాచారం చేశారు. అడ్డుగా వచ్చిన ఆమె తమ్ముడిని, అనంతరం చిన్నారిని హత్య చేసి పక్కనే ఉన్న నది గట్టుపై పడేసి పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం వెతకటం ప్రారంభించారు.