హైదరాబాద్: నగరంలో తొమ్మిదో తరగతి చదుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫీజు కట్టలేదని పాఠశాల యాజమాన్యం తనను పరీక్ష రాయనివ్వలేదు. సారీ అమ్మ అంటూ సూసైడ్‌నోట్ బాలిక రాసిపెట్టింది. జెఎల్ఎస్ నగర్‌కు చెందిన బాలకృష్ణ, సునీత దంపతుల కుమార్తె సాయిదీప్తి(14) జ్యోతినగర్‌లోని జ్యోతి హైస్కూల్లో 9 తరగతి చదువుతుంది. యూనిట్ టెస్టు రాసేందుకు స్కూల్ కు వెళ్లింది. స్కూల్ ఫీజు చెల్లిస్తేనే పరీక్షకు అనుమతిస్తామని యాజమాన్యం తేల్చిచెప్పడంతో, పరీక్ష రాయకుండానే ఇంటికొచ్చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయం లో తనను పరీక్ష రాయనివ్వలేదు మనస్థాపంతో సారీ అమ్మ అని సూసైడ్ నోట్ రాసిన దీప్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.