Home జాతీయ వార్తలు క్లాస్ లీడర్ కాలేదన్న బాధతో….

క్లాస్ లీడర్ కాలేదన్న బాధతో….

Sudent-suside-image

బెంగళూరు: తను చదువుతున్న తరగతిలో క్లాస్ లీడర్‌గా ఎంపిక కాలెద్దన్న తీవ్ర మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజరాజేశ్వరీనగర్‌లోని ఐడియల్ హోమ్ టౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. ఈసంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాల్దిన్ కో ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ హై స్కూల్‌లో ధృవ్‌రాజ్ అనే విద్యార్థి  9 తరగతి చదువుతున్నాడు. అయితే నెల రోజుల క్రితం క్లాస్ లీడర్లకు స్కూల్ యాజమాన్యం ఎన్నికలు జరిపింది. తొమ్మిదో తరగతి నుంచి 4 గురు విద్యార్థులు పోటీ పడ్డారు. వీరిలో ధృవ్‌రాజ్ కూడా ఉన్నాడు. ధృవ్‌రాజ్ తాను ఎన్నికల్లో గెలుస్తానన్న దృడ విశ్వాసంతో ఉన్నాడు. తాజాగా క్లాస్ లీడర్ల ఎంపిక జాబితాను స్కూల్ యాజమాన్యం రిలీజ్ చేసింది. ఆ జాబితాలో ధృవ్‌రాజ్ పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్న ధృవ్‌రాజ్ అదే రోజు రాత్రి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.