Home తాజా వార్తలు 9వ తరగతి బాలిక ప్రసవం

9వ తరగతి బాలిక ప్రసవం

Rape on Woman at Police Station

అమరావతి: తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రసవించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని  అనంతపురం జిల్లా కేంద్రం లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి  బాలిక (14) రాత్రి కడుపు నొప్పి రావడంతో తండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తన కడుపులో గడ్డ ఉందని బాలిక వైద్యులకు తెలిపడంతో ఆపరేషన్ థీయేటర్ కు తరలించారు. పరీక్షించిన వైద్యులు కడుపులో గడ్డ లేదని పిండం ఉండటంతో అవాక్కయ్యారు.  కడుపులో ఉన్న శిశువు ఎలాంటి కదలికలు లేవని చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీశారు. అప్పటికే శిశువు మృతి చెందిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. డిఎస్పి వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినిపై ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం చేశాడని బాలిక చెప్పడంతో, నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.