Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్రంలో ‘నిపా’ వైరస్ లేదు

There is no 'Nipah' virus in the Telangana state
మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణలో ‘నిఫా’ వైరస్ లేద ని, ఆ వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నవారు కూడా లేరని మం త్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి తేల్చిచెప్పారు. ‘నిఫా’ను పోలిన లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నప్పటికీ వారి రక్త నమూనాలను పరీక్షించిన పూణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లేబొరేటరీ ‘నెగెటివ్’ అని నివేదించింది. ఆ ఇద్దరికీ ఉన్నది నిఫా కాద ని పూణె లేబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ డి.టి. మౌర్య ఆ నివేదికలో స్పష్టం చేశారు. వేర్వేరు ఆసుపత్రుల్లో చికి త్స పొం దుతున్న ఆ ఇద్దరిలో ఒకరు టైఫాయిడ్‌తో బాధపడుతున్నారని, మరొకరు బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతున్నారని మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి తేల్చిచెప్పారు. ఈ ఇద్దరిలో ఒకరు కొండాపూర్‌కు చెందినవారుకాగా, మరొకరు హైదరాబాద్ నగరానికి చెందినవారు. లేబొరేటరీ నివేదికను తెలంగాణ వైద్య ఆరో గ్య శాఖ డైరెక్టర్‌తో పాటు కేంద్ర వైద్యారోగ్య శాఖకు కూడా అందజేశారు. రాష్ట్రంలో ఎక్కడా ‘నిఫా’ వైరస్ లేనందున ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ వైద్య యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని, వదంతులను నమ్మవద్దని మంత్రి స్పష్టం చేశారు. టైఫాయిడ్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉం డడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు మంత్రి స్పష్టం చేశా రు. బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం వైద్యులు ఆ పనిలోనే ఉన్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
వదంతులతో ప్రజల్లో భయాందోళనలు :
హైదరాబాదులో ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ సోకిందన్న్ వదంతులు నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. జ్వరంతో హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తి లక్షణాలు నిఫా వైరస్‌ను పోలి ఉన్నాయని అనుమానించిన డాక్టర్లు నమూనాలను పూణె లేబొరేటరీకి పంపించారు. అయితే ఆనను ఐసొలేట్ వార్డులో పెట్టినట్లు వార్తలు రావడంతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో భయం పట్టుకుంది. చివరకు లేబొరేటరీ నుంచి రిపోర్టు రావడం, అది నిఫా కాదని తేలిపోవడంతో ఆందోళన సద్దుమణిగింది.

Comments

comments