Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ ఎంపిల విజయంపై నిరంజన్‌రెడ్డి హర్షం…

టిఆర్‌ఎస్ ఎంపిల విజయంపై నిరంజన్‌రెడ్డి హర్షం…

Niranjan Reddy

 

వనపర్తి : తెలంగాణలో 9 మంది టిఆర్‌ఎస్ ఎంపిల విజయం పట్ల రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం స్థానిక రాజీవ్‌గాంధీ చౌరస్తాలో టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… వనపర్తి జిల్లాలో 74,793 ఓట్లు, జోగులాంబ గద్వాల జిల్లాలో 83,118 ఓట్లు, అలంపూర్ నియోజక వర్గంలో 71,264 ఓట్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 60,531 ఓట్లు, అచ్చంపేట నియోజకవర్గంలో 72,645 ఓట్లు, కల్వకుర్తి నియోజకవర్గంలో 70,645 ఓట్లు, కొల్లాపూర్ నియోజకవర్గంలో 66,646 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా 244 ఓట్లతో విజయం సాధించారన్నారు.

నాగర్ కర్నూల్ ఎంపి పోతుగంటి రాములుకు అత్యధిక మెజార్టీ ఇచ్చిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 4 లక్షల 99 వేల 672 వేల ఓట్లతో ఎంపి. పోతుగంటి రాములు విజయం సాధించడం హర్షనీయమన్నారు. లక్ష 89 వేల మెజార్టీతో రాములు గెలుపొందడం ఇది ప్రజల విజయమేనన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ఎంపి రాములు తో కలిసి తాను శ్రమిస్తానని ప్రజలకు హామి ఇచ్చా రు. మంత్రి నిరంజన్‌రెడ్డి అనంతరం బాణా సంచా కాల్చి మిఠాయిలను పంచిపెట్టారు.

గురువారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఎంపి ఫలితాల్లో ఎంపి పోతుగంటి రాములు విజయంసాధించడంపై నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ,ఎన్నికల అధికారి శ్రీధర్ ఎంపి రాములుకు గెలుపు పత్రాన్ని అందజేశారు. ఈ సంబరాల్లో టిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షులు గట్టుయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి. లక్ష్మయ్య, కౌన్సిలర్స్ వాకిటి శ్రీధర్, ఉంగ్లం తిరుమల్, రమేష్‌నాయక్, నాయకులు కృష్ణ, బండారు కృష్ణ, మురళిసాగర్, మహేష్, జి.జె.శ్రీని వాసులు, సూర్యవంశం గిరి, కంచె రవి, మహేష్, చింటు మండల టిఆర్‌ఎస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.

Niranjan Reddy Elation on the Victory of TRS MPs