Home అభిప్రాయ సేకరణ సిఎం సహాయనిధి చెక్కులు అందజేసిన నిరంజన్‌రెడ్డి

సిఎం సహాయనిధి చెక్కులు అందజేసిన నిరంజన్‌రెడ్డి

give
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన ఐదుగురికి మంజూరైన సిఎం సహాయనిధి చెక్కులను శనివారం రాష్ట్ర ప్రణా ళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి లబ్ది దారుల ఇండ్లకు వెళ్లి అందజేశారు. అనారోగ్యానికి గురై కార్పోరేట్ వైద్య సహాయంతో కోలుకున్న వారిని ఆర్థికంగా ఆదుకుంటామని ఆయన తెలిపారు. గాంధీనగర్‌కు చెంది న డి.బాలస్వామికి రూ. 54 వేలు, న్యూగంజ్‌కు చెందిన పావనికి రూ. 48 వేలు, బండార్ నగర్‌కు చెందిన శరత్‌కుమార్‌కు రూ. 36,500 లు, సాయి నగర్ కాలనీకి చెందిన శివునికి రూ. 15 వేలు, గాంధీనగర్‌కు చెందిన నసీం బేగంకు రూ. 17,500 చెక్కులను అందజేశారు. ఆయన వెంట కౌన్సిలర్లు వాకిటి శ్రీధర్, గట్టుయాదవ్ ,లోక్‌నాథ్‌రెడ్డి, నందిమల్ల భువనేశ్వరి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారం బాళీశ్వరయ్య, డాక్యుమెంటరీ రైటర్ల సంఘం నాయ కులు జహంగీర్, తదితరులు ఉన్నారు.