Home అంతర్జాతీయ వార్తలు లండన్ లో నీరవ్ మోడీ అరెస్టు

లండన్ లో నీరవ్ మోడీ అరెస్టు

Nirav Modiలండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.13 వేల కోట్ల మేరకు టోపీ పెట్టి దేశం విడిచి పారిపోయిన కేసులో  ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీని లండన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లండన్ పారిపోయిన  నీరవ్‌ మోదీ అక్కడ  ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ వజ్రాల వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించినట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నగదు అక్రమ చలామణి కేసులో అతడిని భారత్‌కు అప్పగించాలని ఇడి అధికారులు లండన్‌లోని విదేశాంగ శాఖ అధికారులకు లేఖలు రాశారు. భారత్ అధికారుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు కొద్ది రోజుల క్రితం నీరవ్ మోడీకి  అరెస్టు వారెంట్‌ జారీచేసింది. ఈ క్రమంలోనే బుధవారం లండన్‌ పోలీసులు నీరవ్ మోడీని అరెస్టు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకున్న అనంతరం  నీరవ్‌ మోడీని భారత్‌కు అప్పగించే అవకాశం ఉందని భారత్ కు చెందిన అధికారులు తెలిపారు. లండన్ లో దర్జాగా తిరుగుతూ మీడియా కెమెరాలకు నీరవ్ మోడీ చిక్కిన విషయం తెలిసిందే. దీంతో నీరవ్ లండన్ లోనే ఉంటున్నట్టు తేలిపోయింది. ఈ నేపథ్యంలో అతడిని అరెస్టు చేశారు.

Nirav Modi Arrest in London