Home జాతీయ వార్తలు భద్రతా కారణాల వల్ల ఇండియాకు రాలేను: నీరవ్ మోడీ

భద్రతా కారణాల వల్ల ఇండియాకు రాలేను: నీరవ్ మోడీ

nirav modiన్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును(పిఎన్‌బి) వేల కోట్లకు ముంచేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కొత్త పాట అందుకున్నాడు. తనకు, పిఎన్‌బికి మధ్య జరిగింది సివిల్ లావాదేవీలని, భద్రతా కారణాల రీత్యా తాను భారతదేశానికి తిరిగి రాలేనని నీరవ్ మోడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్‌ఎ) కోర్టుకు శనివారం తెగేసి చెప్పాడు. కొత్తగా తీసుకువచ్చిన పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల నిరోధక చట్టం కింద నీరవ్ మోడీని ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై పిఎంఎల్‌ఎ కోర్టు నీరవ్ మోడీ శనివారం సమాధానమిచ్చారు.

నేనేమీ తప్పు చేయలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ఒక సివిల్ లావాదేవీ.. పరిస్థితి చేజారిపోయింది. భద్రతా కారణాల దృష్టా దేశానికి తిరిగి రాలేను అంటూ తన న్యాయవాది ద్వారా నీరవ్ కోర్టుకు తెలియచేశాడు. నీరవ్ మోడీ యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తున్నట్లు డిసెంబర్ 28న బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన దరిమిలా పిఎంఎల్‌ఎ కోర్టుకు నీరవ్ సమాధామిచ్చాడు.

Nirav Modi Terms PNB Scam