Home తాజా వార్తలు హోంగార్డుపై నిర్భయ కేసు !

హోంగార్డుపై నిర్భయ కేసు !

Arrestహైదరాబాద్: బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న ఓ హోం గార్డు నిర్వాకం ఇది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఖాకీ ఓ యువతిని ప్రేమపేరిట వేధింపులకు పాల్పడ్డాడు. గత ఏడాదిన్నర కాలంగా అతగాడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.  తనకు ఇష్టంలేదని చెప్పిన వినలేదు. అతడి వేధింపులు భరిస్తూ వచ్చిన యువతి చివరకు చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు సదరు హోం గార్డుపై నిర్భయ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ దారుణ సంఘటన నగరంలోని చిలకలగూడలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… లాలాగూడకు చెందిన మహ్మద్ ఇలియాజ్ చిలకలగూడ పోలిస్ స్టేషన్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ముషిరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. కానీ ఆ యువతి ఇలియాజ్ ప్రేమను అంగీకరించలేదు. తనకు ఇష్టంలేదని చెబుతున్న వినకుండా తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకుంటానని వేధించసాగాడు. ఇలా ఏడాదిన్నరగా యువతిని ప్రేమపేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అతడి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. దాంతో భరించలేకపోయిన యువతి ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు హోంగార్డుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఇలియాజ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Nirbhaya Case filed on Hyderabad Home Guard